![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -24 లో.....సాగర్, ధీరజ్ లు నర్మదా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక అక్కడే ఉన్న ప్రేమ.. వీళ్ళేదో చేస్తున్నారని భావించి అదేంటో కనిపెట్టాలి అనుకుంటుంది. కానీ తన ఫ్రెండ్స్ వెళదామనడంతో ప్రేమ వెళ్ళిపోతుంది. మరొకవైపు నర్మదని తీసుకొని సాగర్, ధీరజ్ లు వెళ్ళిపోతారు. మరొకవైపు రామరాజు ఇంటికి వస్తాడు. వేదవతికి సాగర్ కి పెళ్లి సంబంధమంటూ ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాడు. అమ్మాయి బాగుందని వేదవతి అంటుంది.
మరొకవైపు చెంచలమ్మ తన ఊళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంటుంది. సాగర్, ధీరజ్ లు ఇలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నామని బాధపడుతుంటే.. ధీరజ్ కి కోపం వచ్చి కార్ ఆపుతాడు. ఇక మీరు పెళ్లి చేసుకోకండి అని ధీరజ్ అనగా.. వాళ్లు బాధ పడకుండా వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్లు వెళ్తుంటే అప్పుడే అటుగా రామరాజు వెళ్తుంటాడు. అదే సమయంలో రామరాజుకి ఫోన్ వస్తుంది. చెంచలమ్మ రామరాజుకి ఫోన్ చేసి బియ్యం కావాలని అంటుంది. సాగర్, ధీరజ్ నర్మద ఉన్న కార్ ముందు ఉండి రామరాజు ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కడ వాళ్ళని చూస్తాడోనని భయపడతారు కానీ చూడడు.
ఆ తర్వాత ధీరజ్ వాళ్లకి పెళ్లి చెయ్యడానికి పక్క ఊరు గుడికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి ధీరజ్ ఫ్రెండ్స్ అన్ని ఏర్పాట్లు చేస్తారు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్ పెళ్లి జరిగే దగ్గరికి చెంచలమ్మకి బియ్యం తీసుకొని వస్తాడు రామరాజు. అతడిని సాగర్ వాళ్లు చూసి టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |